Jan 25, 2026, 07:01 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
భూ వివాదం.. వ్యక్తిపై కర్రలతో దాడి, తీవ్ర గాయాలు
Jan 25, 2026, 07:01 IST
శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో భూ వివాదం కారణంగా ఉషాన్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉషాన్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స చేసి, నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.