నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుర్ర మల్లయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అతన్ని వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.