కోదాడ మండలంలోని అడ్లూరు గ్రామంలో సోమవారం జరిగిన గ్రామసభలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ప్రశ్నించడంతో ఈ వివాదం చెలరేగింది. ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని, ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు.