మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. శనివారం అతి వేగంగా వచ్చిన లారీ రోడ్డు క్రాస్ చేస్తున్న బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు వెనక భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.