సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ కోడ్ ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన కార్యకర్తలతో కలిసి స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ పట్టణ సీఐ శివ శంకర్ తో వాగ్వాదం జరిగింది. డీఎస్పీ జోక్యంతో మల్లయ్య యాదవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.