ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఆయన మిర్యాలగూడలో పర్యటించి, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహాలపై పార్టీ నాయకులతోనూ సీఎం చర్చించనున్నారు.