మిర్యాలగూడ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న వనం వెంకట్, మేడారం జాతర బందోబస్తు విధుల్లో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యులు ఆయన బ్రెయిన్ డెత్‌కు గురైనట్లు తెలిపారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.