MLGలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకుండా సేవలు అందిస్తున్న 30 ఆసుపత్రులకు, పలు స్కానింగ్ సెంటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.