Feb 23, 2026, 03:02 IST/
ఓయోలో యువకుడు మృతి.. పరారైన ప్రేయసి
Feb 23, 2026, 03:02 IST
భువనేశ్వర్‌లోని ఓయో హోటల్ గదిలో బిటెక్ విద్యార్థి బుబున ప్రధాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు గత ఆరు నెలలుగా ఓ యువతితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు. అయితే యువతే బుబున మృతదేహం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అక్కడి నుండి పారిపోయింది. ఈ సంఘటనతో ఆమెపై అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో ఎయిర్‌ఫీల్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.