ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ నామినేషన్

645చూసినవారు
ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ నామినేషన్
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు (శివనేనిగూడెం) నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ నాగిళ్ల కావేరి (సుధాకర్) శుక్రవారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ నామినేషన్ దాఖలు కేంద్రంలో అధికారులకు సమర్పించింది. నామినేషన్ చివరి రోజు కావడంతో ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ను అందజేసింది. చిట్యాల పట్టణ చరిత్రలో ఒక ట్రాన్స్ జెండర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం.

సంబంధిత పోస్ట్