నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవరం (కలాన్) గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన భార్య మామిడి ముత్తమ్మ (73) మృతిని తట్టుకోలేక భర్త మామిడి సైదులు (79) ఐదు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. శనివారం ఉదయం భార్య మృతి చెందగా, మధ్యాహ్నానికి భర్త కూడా కుప్పకూలి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దంపతులకు ఏకైక కుమార్తె యాదమ్మ ఉన్నారు.