చావులోనూ వీడని బంధం

139చూసినవారు
చావులోనూ వీడని బంధం
శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామంలో విషాదం నెలకొంది. వృద్ధాప్యంతో మామిడి ముత్తమ్మ(70) శనివారం మృతి చెందారు. దశాబ్దాల పాటు తనతో జీవించిన భార్య మరణ వార్తను తట్టుకోలేక, అనారోగ్యంతో ఉన్న భర్త సైదులు(80) కూడా గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. ఏడడుగుల బంధం చివరి వరకు వీడలేదని, ఒకరి తర్వాత ఒకరు అనంత లోకాలకు పయనమయ్యారని గ్రామస్తులు కన్నీటితో తెలిపారు.

సంబంధిత పోస్ట్