ఉమ్మడి నల్గొండ జిల్లాలో బుధవారం నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుడికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని అందించనున్నారు. జిల్లాలో 5.27 లక్షల కార్డులకు గాను 22,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. మొత్తం 1,051 రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. బియ్యం స్టాక్ ఇప్పటికే ఆయా షాపులకు తరలిస్తున్నారు.