నల్గొండలో పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు 20 నుంచి

915చూసినవారు
నల్గొండలో పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు 20 నుంచి
నల్గొండ జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) బిక్షపతి తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయి. మొత్తం 3,837 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్