నల్గొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

675చూసినవారు
నల్గొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెద్దవూర మండలంలోని పెద్దగూడెం గ్రామంలో గురువారం, జానపాటి కోటేష్ (33) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత ఆరు నెలలుగా భార్య హేమలత పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుండగా, కోటేష్ ఇంట్లో గొంతుపై తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారు గమనించి, భార్యకు సమాచారం అందించారు. హేమలత వచ్చి, శవాన్ని నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్