నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయరహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి (55), దీప సరిత (50) మృతిచెందారు. మూడు కార్లలో మొత్తం పదిమంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.