రేవంత్ రెడ్డి నల్గొండ టూర్: రాజ్ గోపాల్ రెడ్డి హాజరవుతారా? సస్పెన్స్

2422చూసినవారు
రేవంత్ రెడ్డి నల్గొండ టూర్: రాజ్ గోపాల్ రెడ్డి హాజరవుతారా? సస్పెన్స్
నేడు ఆదివారం నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అయితే, ఈ పర్యటనతో వెరైటీ పాలిటిక్స్ కు తెరలేచింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగ సభకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి పదవి విషయంలో సభలో నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైన అనుచరవర్గాన్ని అడ్డుకునే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. మరోవైపు, నల్గొండలో డీసీసీ వర్సెస్ మినిస్టర్ వర్గాల మధ్య వివాదం రాజుకుంది. సభకు రావొద్దంటూ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ కు మంత్రి కోమటిరెడ్డి వర్గం ఆదేశాలు పంపినట్లు సమాచారం. ప్రోటోకాల్ పాటించడం లేదని డీసీసీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్లెక్సీల్లో డీసీసీ ఫోటో మిస్ అవ్వడం కూడా వివాదానికి దారితీసింది. సీఎం టూర్ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడిని, ఆయన వర్గాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్