నల్గొండలోని రామానంద తీర్థ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి వేముల శివ సాయి, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో విద్యార్థికి రెండు కాళ్లు విరిగాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై, ప్రిన్సిపాల్ సునీత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రెండు రోజులు గడిచినా ఆపరేషన్ చేయించలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే కలెక్టర్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.