మూడు కార్లు, బైక్ ఢీ.. పలువురికి గాయాలు

3054చూసినవారు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై మూడు కార్లు, ఒక బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లలో ప్రయాణిస్తున్న పది మందిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీకొని రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్