రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

1092చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నిడమనూరు మండలం పరిధిలోని ముకుందాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో 68 ఏళ్ల లక్ష్మమ్మ మృతి చెందింది. NH-167 జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను, మిర్యాలగూడ వైపు నుంచి హాలియా వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమెను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో నల్గొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు సైదయ్య ఫిర్యాదు మేరకు టాటా ఏస్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉప్పు సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్