నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి ఆత్మహత్య

1224చూసినవారు
నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి ఆత్మహత్య
కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో తాగుడుకు బానిసై కొత్త నాగరాజు (29) అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న నాగరాజు భార్య, కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.

సంబంధిత పోస్ట్