సూర్యాపేట: టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడిన కారు

138చూసినవారు
సూర్యాపేట: టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడిన కారు
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కారు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు కోదాడ మండలం చిమిర్యాల క్రాస్రోడ్ సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న సమయంలో కారు ముందువైపు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి రహదారిపై పల్టీలు కొడుతూ బోల్తా పడింది.

సంబంధిత పోస్ట్