సూర్యాపేట: వరి కోత మిషన్ ఆపరేటర్ హఠాన్మరణం

1625చూసినవారు
సూర్యాపేట: వరి కోత మిషన్ ఆపరేటర్ హఠాన్మరణం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో ఉపాధి కోసం వచ్చిన సూర్యాపేట జిల్లా పొనుగోడు గ్రామానికి చెందిన ఆపరేటర్ యూసుబు (32) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. వరి కోత పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన యూసుబు, ఛాతిలో అసౌకర్యంగా ఉందని ఆసుపత్రికి వెళ్లి ఔషధాలు తీసుకున్నాడు. మధ్యాహ్నం పెట్రోలు బంకు సమీపంలో కుప్పకూలిపోవడంతో స్థానికులు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నేలకొండపల్లి సీహెచ్సీకి తరలించారు. పండగ వేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you