సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

1838చూసినవారు
సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేళ్లచెరువుకు చెందిన సతీష్ (25), నరసింహారావు (36) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మేళ్లచెరువు నుండి దురాజ్ పల్లికి బొలెరో వాహనంలో వెళుతుండగా, ఎదురుగా అతివేగంతో వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్