సూర్యాపేట రూరల్ పిల్లల మర్రి శివారులో, యాపలగడ్డ సమీపంలో గీత కార్మికుడు గౌని జానయ్య (35) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. కల్లు వ్యాపారం కోసం పిల్లలమర్రి గ్రామంలో భాగస్వామి అయిన జానయ్య, రోజు మాదిరిగానే ఉదయం కల్లు తియ్యడానికి చెట్టు ఎక్కగా, మోకు ఊడి కింద పడిపోయాడు. ఎత్తయిన చెట్టు నుండి తల నేలకు గుద్దుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో రామన్నగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.