మహాలక్ష్మి పథకం మహిళల పాలిట వరమని, ఉచిత బస్సు ప్రయాణం వారి ఆర్థిక, విద్య, ఉపాధి పరంగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. సూర్యాపేట కొత్త బస్ డిపోలో నిర్వహించిన మహాలక్ష్మి పథకం విజయోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.