జాతీయ రహదారిపై వల్లభాపురం వద్ద జరిగిన డీసీఎం, టాటా ఏసీ ప్రమాద స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ నరసింహ పరిశీలించారు. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ, 'డిఫెన్సివ్ డ్రైవింగ్' అలవర్చుకోవాలని సూచించారు. రహదారి లోపాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీటు బెల్టు ధరించడం, అప్రమత్తతతోనే ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్పీ తెలిపారు.