యాదాద్రి: విషాదంలోను మానవత్వం చాటిన ఆ కుటుంబం

0చూసినవారు
యాదాద్రి: విషాదంలోను మానవత్వం చాటిన ఆ కుటుంబం
గుండాల మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. బ్రెయిన్ డెడ్ అయిన బత్తిని హరీష్ గౌడ్ (24) అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాదులో నివసిస్తున్న హరీష్ గౌడ్, నాలుగు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. యశోద హాస్పిటల్‌లో ఐదు రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందినప్పటికీ, వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు బత్తిని ఎల్లయ్య, మహేశ్వరి అవగాహనతో అవయవ దానానికి అంగీకరించారు. హరీష్ గౌడ్ అవయవాలు పలువురికి ప్రాణదాతగా మారాయి. విషాదంలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందించారు.
Job Suitcase

Jobs near you