యాదగిరి గుట్ట మండలం - Yadagirigutta Mandal

యాదాద్రి భువనగిరి జిల్లా
గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు కొత్త రూల్.. ఇకపై 21 రోజులు ఆగాల్సిందే!
Mar 07, 2026, 09:03 IST/

గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు కొత్త రూల్.. ఇకపై 21 రోజులు ఆగాల్సిందే!

Mar 07, 2026, 09:03 IST
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు కొత్త నిబంధనలు అమలు చేశాయి. ఇకపై ఒకసారి LPG సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేయాలంటే కనీసం 21 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత వస్తుందన్న భయంతో ప్రజలు భారీగా బుకింగ్స్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పానిక్ బుకింగ్స్ వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ లాక్-ఇన్ రూల్ అమలు చేస్తున్నారు. కాగా, దేశంలో LPG నిల్వలు సరిపడా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.