
రాహుల్ ముందు సిద్ధూ డిమాండ్ల జాబితా
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన సిద్ధరామయ్య, శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించాలని సిద్ధూ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం సిద్ధరామయ్య గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లి, శుక్రవారం ఉదయం కుమారుడితో కలిసి రాహుల్‌ను కలిశారు. రాజ్యసభకు వెళ్లే ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు సిద్ధూ తెలిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.




