క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానిని పరామర్శించిన యశ్

6చూసినవారు
కన్నడ స్టార్ హీరో యశ్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన వీరాభిమాని సునీల్‌కు స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడైన సునీల్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న యశ్, ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చికిత్సకు అవసరమైన సహాయం చేస్తానని యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అభిమానుల పట్ల యశ్ ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్