వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అయి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఢిల్లీ వేదికగా రెండో రోజు తొలి సెషన్‌లో ఈ సంఘటన జరిగింది. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ పరుగు కోసం ముందుకు రాకపోవడంతో, జైస్వాల్ సగం క్రీజ్ వరకు వెళ్లి వెనక్కి వెళ్లే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.