
రష్యా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. భారీ నష్టం
రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగి, రష్యన్ చమురు టెర్మినల్‌ను ప్రభావితం చేశాయి. ఉక్రెయిన్ సైనిక లాజిస్టిక్స్‌కు అంతరాయం కలిగించడానికి ఈ దాడి చేసిందని రష్యా అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ప్రాణనష్టంపై అధికారులు ఎటువంటి సమాచారం వెల్లడించ లేదు.




