తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు రేపు ఉదయం(8.30AM) వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ఆసిఫాబాద్, NRML, KMM, NLG, సూర్యాపేట, MBBD, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, WGL, RR, MBNR జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రానున్న 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.