కైకలూరులో పసుపు రంగు కప్పల కలకలం.. శాస్త్రీయ కారణం ఇదే!

11656చూసినవారు
కైకలూరులో పసుపు రంగు కప్పల కలకలం.. శాస్త్రీయ కారణం ఇదే!
AP: ఏలూరు జిల్లా కైకలూరులో భారీ వర్షాల అనంతరం చెరువుల నుంచి అకస్మాత్తుగా పసుపు రంగులో మెరుస్తున్న కప్పలు బయటకు వచ్చాయి. వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కప్పల శాస్త్రీయ నామం ‘హూప్లోచాట్రాసస్ టైగిరినస్’, వీటిని ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు. వెటర్నరీ అధికారులు ఈ రంగు మార్పుకు కారణం వర్షాకాలంలో మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించడానికి తమ శరీరాన్ని ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మార్చుకోవడమేనని తెలిపారు. వర్షాకాలం ముగియగానే ఇవి మళ్లీ సాధారణ రంగులోకి వస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్