ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ రైలు ఎక్కలేరు

15చూసినవారు
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ రైలు ఎక్కలేరు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్వింగ్హై-టిబెట్ రైల్వే మార్గం 1,956 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ ప్రయాణంలో రైలు సగటున 4,000 మీటర్ల ఎత్తులో పరుగులు తీస్తుంది. ప్రయాణంలో అత్యున్నత పాయింట్ అయిన ‘టాంగులా పాస్’ వద్ద రైలు ఏకంగా 5,072 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిలను అధిగమించడానికి రైలులో ప్రత్యేక ఆక్సిజన్ వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్నాయి. కిటికీల గుండా కనిపించే మంచు పర్వతాలు, పచ్చని లోయల వంటి అద్భుత ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.