
తెలంగాణకు నీటి విడుదలకు అంగీకరించిన కర్ణాటక
తెలంగాణకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది. విడతలవారీగా 3 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి హామీ ఇచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇరిగేషన్ అధికారులతో పాలమూరు ప్రజాప్రతినిధులు జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.




