వరదలో యువజంట మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు

798చూసినవారు
వరదలో యువజంట మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు
TG: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో వరద ఉధృతికి వాగులో గల్లంతైన కల్పన (24), ప్రణయ్ (28) దంపతుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ నెల 29న కల్పన పుట్టినరోజు కావడంతో ఇద్దరూ బయటకు వెళ్లారు. మోత్కులపల్లి సమీపంలో బైక్ పై లోలెవల్ బ్రిడ్జి దాటుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య శుక్రవారం వారిద్దరి మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్