రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వెంకటాపురంకు చెందిన ఈగ మహేష్ (28) అనే ప్రైవేటు ఉద్యోగి, మేథా కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన హోండా ఆక్వాపై ఉద్యోగానికి వెళుతుండగా, జోడిమెట్ల మలుపు వద్ద వెనుక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.