యూపీలోని గోరఖ్‌పూర్‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువతి, 15 ఏళ్ల బాలుడికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. యువతి బాలుడిని హోటల్‌కు రప్పించి అత్యాచారం చేసింది. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ రూ.12 లక్షలు డబ్బులు కావాలని బాలుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా ఫేక్ ప్రెగ్నెన్సీ పేరుతో బెదిరింపులకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అరెస్ట్ చేశారు.