యంగ్ హీరో సుహాస్ మళ్లీ తండ్రి అయ్యాడు. సుహాస్, లలిత దంపతులకు శుక్రవారం కుమారుడు జన్మించాడు. వీరికి మొదట కూడా కొడుకే జన్మించాడు. ఈ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సుహాస్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ తాజాగా ఉప్పుకప్పురంబులో కీర్తి సురేష్‌తో నటించాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.