బ్రష్ చేసుకుంటూ కుప్పకూలిన యువ న్యాయవాది.. గుండెపోటుతో మృతి

TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 31 ఏళ్ల యువ న్యాయవాది సామ సుధీర్ గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం బ్రష్ చేసుకుంటూ సడన్‌గా కింద పడిపోయాడు. అతన్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సుధీర్ తన న్యాయవాద చదువును పూర్తి చేసి, గ్రామస్థులకు న్యాయసలహాలు అందిస్తూ సహాయపడేవాడని స్థానికులు తెలిపారు. ఆయన భార్య, ఆరు నెలల బాబు, తల్లి ఉన్నారు.