కాటువేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన యువకుడు

47చూసినవారు
కాటువేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన యువకుడు
AP: పాముకాటుకు గురైన యువకుడు ఆ పామును చంపి దానిని తీసుకుని ఆసుపత్రికి వచ్చిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. నెల్లూరు శివారు ప్రాంతానికి చెందిన యువకుడు సోమవారం మధ్యాహ్నం హోటల్లో భోజనం చేస్తుండగా రక్తపింజరి కాటు వేసింది. అప్రమత్తమైన యువకుడు వెంటనే దానిని చంపేసి, ఆ కళేబరంతో సహా కోవూరు CHCలోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి సిబ్బంది, రోగులు భయపడిపోయారు. వైద్య సిబ్బంది వెంటనే అతడికి చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరు పంపించారు.

సంబంధిత పోస్ట్