యువకుడిని బీర్ బాటిల్స్‌తో కొట్టి, పొడిచి చంపేశారు

23072చూసినవారు
యువకుడిని బీర్ బాటిల్స్‌తో కొట్టి, పొడిచి చంపేశారు
TG: పేట్ బషీరాబాద్ PS పరిధిలోని దూలపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. షెడ్‌లో మద్యం తాగుతున్న శ్రీకాంత్ గౌడ్(35), అలీపై ఒక బ్యాచ్ ఆకస్మికంగా దాడి చేసింది. శ్రీకాంత్‌ను బీర్ బాటిల్స్‌తో కొట్టి, పొడిచి చంపేశారు. అలీకి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్‌ హత్యకు భూ వివాదాలు, పాత కక్షలే కారణమని స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్