విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఓ యువకుడు మహిళల బాత్రూంలోకి చొరబడి, స్నానం చేస్తున్న మహిళల దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. మహామండపంలోని 6వ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేకలు వేసిన మహిళలు, అక్కడికి చేరుకుని నరేష్(20)ను పట్టుకుని చితకబాదారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందినవాడని గుర్తించారు.