యూపీలోని అలీఘర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు, యువతి కలిసి తిరుగుతుండగా ఆమె కుటుంబ సభ్యులు వారిని చూశారు. ఆగ్రహంతో ఊగిపోయిన వారు నడిరోడ్డుపైనే ఆ యువకుడిని బెల్టుతో దారుణంగా చితకబాదారు. అతడిని రక్షించేందుకు అడ్డువచ్చిన సదరు యువతిని కూడా వారు వదలకుండా కొట్టారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.