AP: తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు మంటల్లో దగ్ధమైంది. శివాలయం సమీపంలోని ఉన్న ఇంట్లో తల్లి హేమక్క, కుమారుడు మునికుమార్ ఉన్నారు. మంటలు గమనించిన వారు వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే విలువైన వస్తువులు తీసుకురావడానికి మునికుమార్ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో అతను సజీవ దహనమయ్యాడు. తల్లి హేమక్క సురక్షితంగా బయటపడింది.