పెళ్లికి నిరాకరించిందని సెల్ టవర్ ఎక్కిన యువకుడు (వీడియో)

14చూసినవారు
TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో శనివారం ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో హఫీజ్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న యువతి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై టవర్ ఎక్కినట్లు హాఫీజ్ తెలిపాడు. ప్రేమించిన యువతితో మాట్లాడిస్తేనే దిగుతానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు, గ్రామస్తుల సహాయంతో యువకుడిని క్షేమంగా కిందకు దించి, అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్