AP: కడపలో ఒక యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఎస్పీ బంగ్లా ఎదురుగా తన కారును అడ్డంగా నిలిపి, కారుపై ఎక్కి గొడవకు దిగాడు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను లెక్కచేయకుండా హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, ఆ యువకుడిని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.