ఐ ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

17272చూసినవారు
ఐ ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
AP: ఐ ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని సుజాతనగర్ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్టాక్ మార్కెటింగ్ విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయన కుమారుడు కిన్నె సాయి మారుతి కెవిన్(26) ఇంటర్ పూర్తి చేసి సినీరంగంలో ఫొటోగ్రఫీ విభాగంలో పని చేశాడు. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఐ ఫోన్ కొనకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు.

సంబంధిత పోస్ట్